అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ స్వాధీనం

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ స్వాధీనం

ADB: గుడిహత్నూర్ మండల పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను అటవీ శాఖ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. తాజాగా అటవీ ప్రాంతంలో నిర్వహించిన తనిఖీల్లో ఈ అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. సరైన అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించిన అధికారులు ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.