విద్యుత్ కష్టాలకు చెక్.. 296 ట్రాన్స్ ఫార్మర్‌లు సిద్ధం
KMM: జిల్లాలో వేసవిలో అంతరాయం లేని విద్యుత్తును అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు AE శ్రీనివాస చారి తెలిపారు. ఇందుకోసం 296 కొత్త ట్రాన్స్ ఫార్మర్లు,10 సబ్ స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచామన్నారు. అత్యవసర సమయాల్లో ప్రత్యామ్నాయ సరఫరా కోసం ఇంటర్ంకింగ్ వ్యవస్థను సిద్ధం చేశామని, ఫిర్యాదుల కోసం 1912 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.