బ్రిడ్జిని పరిశీలించిన గ్రామ కార్యదర్శి
MDK: గత నెలల క్రితం కురిసిన భారీ వర్షాలకు చెరువులు, బ్రిడ్జిలు ద్వంసమయ్యాయి. నిజాంపేట మండలం నందగోకుల్, కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం ఇస్సానగర్ వెళ్లే రోడ్డులో గల బ్రిడ్జి కింద మట్టి వరద ఉధృతికి కొట్టుకుపోయింది. విషయం తెలుసుకున్న గ్రామ కార్యదర్శి భాగ్యలక్ష్మి సోమవారం బ్రిడ్జిని పరిశీలించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని పేర్కొన్నారు.