బాలల పరిరక్షణకు మండల స్థాయి కమిటీ ఏర్పాటు
NLG: నేరేడుగొమ్ములో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఎంపీడీవో సన్నీ అబ్రహం అధ్యక్షతన మంగళవారం మండల బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేశారు. బాల్య వివాహాలు, అక్రమ దత్తత, బాలికలపై లైంగిక వేధింపులు, వంటి బాలల సమస్యలను అధిగమించేందుకు ఈ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో చంద్రకళ, ఎంఈఓ రఘు, ఎస్సై, ఏపీఎం, సూపర్వైజర్స్ జి.మేరీ, పి.శోభ పాల్గొన్నారు.