మేడారంలో నిరుద్యోగుల వినూత్న నిరసన!
HNK: ప్రభుత్వం నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంపై నిరుద్యోగ యువత మేడారం జాతరలో వినూత్నంగా తమ నిరసనను వ్యక్తం చేశారు. బీటెక్, డిగ్రీ పూర్తి చేసి ఏళ్లు గడుస్తున్నా కొలువులు రాకపోవడంతో జీవనోపాధి కోసం జాతరలో చిరు వ్యాపారాలు, షాపులు పెట్టుకున్నామని బ్యానర్లను ప్రదర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగ కల్పన చేపట్టాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.