డబ్బులు ఎవరికీ ఊరికే రావు: సీపీ సజ్జనార్

డబ్బులు ఎవరికీ ఊరికే రావు: సీపీ సజ్జనార్

హైదరాబాద్ నగరంలో రోజుకి కోట్ల విలువైన సైబర్ నేరాలు జరుగుతున్నాయని సీపీ సజ్జనార్ తెలిపారు. పెట్టుబడుల పేరుతో చాలా యాప్‌లలో ప్రజలు మోసపోతున్నారని, డబ్బు ఊరికే రాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. APK ఫైల్స్ ద్వారా కూడా మోసాలు జరుగుతున్నాయని వివరించారు. సైబర్ నేరాల్లో డబ్బు పోగొట్టుకున్న వెంటనే బాధితులు 1930 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు