సొంత గూటికి చేరుకుని హర్షం వ్యక్తం చేసిన విద్యార్థులు
ASR: సొంత గూటికి చేరుకున్న విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. కొయ్యూరు మండలం బాలారం ఏకలవ్య మోడల్ పాఠశాల విద్యార్థులు ఆదివారం హర్షం వ్యక్తం చేశారు. బాలారం గ్రామానికి ఏకలవ్య పాఠశాల మంజూరయింది. అయితే సొంత భవనాలు లేక సుమారు నాలుగేళ్లనుంచి విద్యార్థులకు వేరే ప్రాంతంలో తరగతులు నిర్వహించారు. ఇటీవలే భవన నిర్మాణాలు పూర్తి కావడంతో విద్యార్థులు బాలారం చేరుకున్నారు.