'వృద్ధుల చట్టం 2007 పై అవగాహన ఉండాలి'
ప్రకాశం: కనిగిరి మండల న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, జడ్జి రూపశ్రీ నేతృత్వంలో ఇవాళ స్థానిక MKR కాలనీలో మున్సిపల్ ఛైర్మన్ పాల్గొని అబ్దుల్ గఫార్ వృద్ధుల చట్టం 2007 పై అవగాహన కలిగించారు. ఆయన మాట్లాడుతూ.. వృద్ధులకు వారి పిల్లలు నుంచి ఆర్థిక సహాయం పొందే హక్కు ఉందని, ఈ చట్టం కింద తమను తాము పోషించుకోలేని వృద్ధులకు తమ పిల్లలు నుంచి భరణం పొందే హక్కు ఉందని తెలిపారు.