తోట తరణిపై పవన్ ప్రశంసలు

తోట తరణిపై పవన్ ప్రశంసలు

ప్రముఖ కళా దర్శకుడు తోట తరణికి ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రకటించిన పురస్కారం 'చెవాలియర్‌ డె లా లీజియన్‌ డి హానర్'పై Dy CM పవన్ హర్షం వ్యక్తం చేశారు. తరణిని దేశంలోనే అత్యుత్తమ కళా దర్శకులలో ఒకరిగా పవన్ ప్రశంసించారు. ఆయన ఏ కథాంశమైనా సహజత్వం ఉట్టిపడేలా, లోతుగా అధ్యయనం చేసి సెట్స్ రూపొందిస్తారని కొనియాడారు. భవిష్యత్ తరాలు ఆయన నుంచి స్ఫూర్తి పొందాలని కోరుకున్నారు.