మరమ్మత్తులు చేయించిన వైస్‌ఛైర్మన్
NLR: బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్‌లో త్రాగునీరు మోటర్ కాలిపోయింది. దీంతో త్రాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్యను స్థానికులు స్థానిక కౌన్సిలర్ వైస్‌ఛైర్మన్ అయిన శివకుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. తక్షణమే స్పందించి ఇవాళ మోటార్‌కు మరమత్తులు చేయించారు. దీంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.