అత్తింటి వేధింపులు భరించలేక పోలీసులకు ఫిర్యాదు
CTR: వెదురుకుప్పం మండలం సోమేంద్రపురానికి చెందిన చిలకమ్మ అత్తింటి వేధింపులు భరించలేక పోలీసులను ఆశ్రయించింది. భర్త మరణానంతరం అత్తింటి వర్గీయులు ఆస్తి ఇవ్వకుండా ఇంటి నుంచి గెంటివేసి మానసికంగా హింసిస్తున్నారని ఆరోపించింది. పిల్లలతో కలిసి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నానని, ప్రాణహాని కూడా ఉందని తెలిపింది. తనకు న్యాయం చేయాలని కోరింది.