సినీ కార్మికుల ఆందోళనపై మంత్రి కోమటిరెడ్డి స్పందన

HYD: సినీ కార్మికులకు వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఢిల్లీ పర్యటన తర్వాత సినీ కార్మికులతో మాట్లాడతా అని అన్నారు. సినీ ఇండస్ట్రీ అంశాలన్నీ దిల్‌రాజుకు అప్పగించాం అని, సినీ కార్మికుల ఆందోళనపై వారు చర్చిస్తున్నారని పేర్కోన్నారు. కార్మికుల డిమాండ్లపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.