హత్యాయత్న ఘటనపై డీఎస్పీ విచారణ

విశాఖ: పెట్రోల్ పోసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై డీఎస్పీ మోహన్ విచారణ చేపట్టారు. మండలంలోని రాచపల్లిలో తుంగళ్ల రమణ భార్య విజయ నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దాడిలో భార్య విజయ, చిన్న కుమార్తె కావ్యశ్రీలు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై అందిన ఫిర్యాదుతో శనివారం డీఎస్పీ విచారణ జరిపారు. ఆయన వెంట సిఐ హరి, ఎస్ఐ రామకృష్ణ ఉన్నారు.