అధ్వానంగా రోడ్లు.. అరచేతిలో ప్రాణాలు!

అధ్వానంగా రోడ్లు.. అరచేతిలో ప్రాణాలు!

NLG: దశాబ్దాలు గడుస్తున్నా చందంపేట,నేరెడుగొమ్ము,డిండి,పీఏపల్లి మండలాల్లోని కొన్ని గ్రామాలకు నేటికీ రోడ్డు రవాణా సౌకర్యం కల్పించకలేకపోవడం పాలకుల పనితీరుకు అద్దం పడుతోంది. సరైన రోడ్డు మార్గం, వంతెనలు లేక గర్భిణులు, బాలింతలు అంబులెన్స్‌ సేవలను పొందలేకపోతున్నారు. ఏడాది క్రితం గిరిజన వృద్ధుడు, మూడేళ్ల కిందట ఓ గర్భిణి వాగు దాటుతూ అందులో చిక్కుకొని మృతి చెందారు.