మహిళపై హత్యాయత్నం .. చేసిన వ్యక్తి అరెస్ట్

BHPL: కాటారంలో నిన్న మహిళపై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఎస్సై గీత తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది భూ వివాదంలో బాధితురాలు లక్ష్మి, కుటుంబ సభ్యులతో కలిసి సారయ్యను హత్య చేసింది. బెయిల్‌పై విడుదలైన లక్ష్మిపై సారయ్య కుమారుడు అంజి గొడ్డలితో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో లక్ష్మి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అంజిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు.