చిత్తూరు హైవేరోడ్డు విస్తరణకు చర్యలు

చిత్తూరు: జిల్లాలోని హైవే రోడ్డును వీలైనంత త్వరగా విస్తరిస్తామని మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ వెల్లడించారు. చిత్తూరు స్మార్ట్ సిటీ డెవలప్‌మెంట్ సొసైటీ అధ్యక్షుడు తాండవమూర్తి తదితరులు హైవే రోడ్డు విస్తరణపై కమిషనర్‌తో మాట్లాడారు. అధికారులు స్పందిస్తూ.. హైవే రోడ్డును వంద అడుగుల వెడల్పుతో విస్తరించడానికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.