ఢిల్లీ బ్లాస్ట్.. నలుగురు కీలక నిందితులు అరెస్ట్

ఢిల్లీ బ్లాస్ట్.. నలుగురు కీలక నిందితులు అరెస్ట్

ఢిల్లీ పేలుడు ఘటన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మరో నలుగురు కీలక నిందితులను NIA అధికారులు అరెస్ట్ చేశారు. వీరిని శ్రీనగర్‌లో అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితులు డా.ముజమ్మిల్ షకీల్(పుల్వామా), డా.అదీల్ అహ్మద్(అనంత్ నాగ్), డా. షాహీన్ సయిద్(లక్నో), ముఫ్తీ ఇర్ఫాన్(షోపియాన్)గా గుర్తించారు. వీరికి కోర్టు రిమాండ్ విధించింది.