కస్తూర్బాలో నీటి తిప్పలు.. విద్యార్థినుల అవస్థలు
SRPT: చివ్వెంల మండల కేజీబీవీలో మూడు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో విద్యార్థినులు అల్లాడుతున్నారు. మోటార్ కాలిపోయినా ఎస్‌వో పట్టించుకోకపోవడంతో స్నానాలకు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత్యంతరం లేక బయట బోరు నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నామని విద్యార్థినులు వాపోతున్నారు. అధికారులు నీటి సమస్యను పరిష్కరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.