బీటీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే
SKLM: హిరమండలం మండలం అక్కరాపల్లి నుంచి పూనిపేట గ్రామం వరకు నిర్మించిన బీటీ రోడ్డును పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారులు ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతాయని తెలిపారు. అలాగే, ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.