నేడు తిరుమలకు రానున్న సీఎం
TPT: శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు సీఎం చంద్రబాబు కుటుంబంతో ఇవాళ రానున్నారు. సాయంత్రం తిరుమల చేరుకుని, రాత్రికి గాయత్రీ నిలయం అతిథిగృహంలో బస చేయనున్నారు. ఈ మేరకు రేపు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోనున్నారు. మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా రేపు ఒక్కరోజు అన్నవితరణకు విరాళం అందజేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.