23 రోజులైనా జీతం రాలేదు... కార్మికుల ఆవేదన
నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో సుమారు 1200 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. ఏప్రిల్ ఒకటో తేదీన రావాల్సిన జీతాలు నేటికీ (23వ తేది) ఖాతాలో పడలేదు. స్ట్రైక్ సమయంలో 15 రోజుల జీతాలను చెల్లించాలని ప్రభుత్వం 2నెలల కిందట ఆదేశించింది. వాటిని ఇప్పటికీ వరకు ఇవ్వలేదు. దీంతో కార్మికులు అప్పులు చేసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.