పిడుగుపాటుకు రెండు ఆవులు మృతి
NRPT: కొత్తపల్లి మండల కేంద్రంలో గురువారం రాత్రి ఉరుములు మెరుపులతో కురిసిన వర్షానికి గ్రామానికి చెందిన అల్లి పెంటప్ప రెండు పాడి ఆవులు పిడుగుపాటుకు గురై మృతి చెందాయి. అవి దాదాపు రూ.లక్ష విలువ ఉంటుందని, బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీద కుటుంబానికి చెందిన రైతు పెంటప్పను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.