బార్ అసోసియేషన్‌లో న్యాయవాది ఫిర్యాదు
HYD: సింగర్ మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన న్యాయవాది సుబ్బారావుకు పంజాగుట్ట పోలీసులు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పంజాగుట్ట పోలీసులపై బార్ అసోసియేషన్‌లో న్యాయవాది సుబ్బారావు ఫిర్యాదు చేశారు. తనపై పోలీసులు వ్యవహరించిన తీరుతో మనస్థాపం చెందినట్లు ఫిర్యాదులో న్యాయవాది సుబ్బారావు పేర్కొన్నట్లు సమాచారం.