'పంట నష్టం సర్వే, యూరియా పంపిణీ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి'

ASF: జిల్లాలో పంట నష్టం సర్వే, యూరియా పంపిణీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వ్యవసాయ, సహకార శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. భారీ వర్షాల వల్ల 15 వేల ఎకరాల పంట దెబ్బతిందని అంచనా వేసినందున, పంట నష్టంపై సర్వే చేసి వెంటనే నివేదికలు అందించాలన్నారు.