VIDEO: లక్ష్మీ నరసింహ స్వామికి వైభవంగా పల్లకి సేవ
ప్రకాశం: కనిగిరి కేటీఆర్ టెక్నో స్కూల్ ప్రాంగణంలోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం నారసింహ స్వామివారికి పల్లకి సేవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. దేవస్థానం అర్చకులు చోడా వీరభద్రస్వామి పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ అధ్యక్షులు కుందురు తిరుపతి రెడ్డి, కార్యదర్శి సత్యాలు, తదితరులు పాల్గొన్నారు.