VIDEO: 'పంట అవశేషాల దహనం భూసారానికి చేటు'

VIDEO: 'పంట అవశేషాల దహనం భూసారానికి చేటు'

NTR: నందిగామ నియోజకవర్గంలోని అల్లూరు, జుజ్జూరు గ్రామాల్లో మొక్కజొన్న కోతల తర్వాత రైతులు పంట వ్యర్థాలను దహనం చేస్తున్నారు. అయితే దీని వల్ల భూసారం తగ్గి, పర్యావరణానికి హాని కలుగుతుందని వ్యవసాయ అధికారులు వెల్లడించారు. వ్యర్థాలను దహనం చేయడం వలన స్థానికులకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. పంట అవశేషాలను కాల్చకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని అధికారులు కోరుతున్నారు.