VIDEO: రోడ్డు ఆక్రమణ మార్కింగ్ పనులు పర్యవేక్షణ
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక సండే మార్కెట్ ప్రాంతంలో పట్టణ ప్రణాళిక విభాగం వారు శనివారం చేపట్టిన రోడ్డు ఆక్రమణల మార్కింగ్ పనులను పర్యవేక్షించారు. టౌన్ ప్లానింగ్ విభాగం ఇచ్చిన మార్కింగ్ పరిధి దాటి డ్రైను కాలువలపై మెట్లు, ర్యాంపులు నిర్మాణాలు చేయకుండా అధికారులు పర్యవేక్షించాలని కమిషనర్ సూచించారు.