రాంగ్ రూట్ డ్రైవింగ్‌తో ప్రాణనష్టం… నిందితుడు అరెస్ట్

రాంగ్ రూట్ డ్రైవింగ్‌తో ప్రాణనష్టం… నిందితుడు అరెస్ట్

జాతీయ రహదారి-40పై రాంగ్ రూట్‌లో పాల ట్యాంకర్ నడిపి ప్రమాదానికి కారణమైన మస్తాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో దువ్వూరుకు చెందిన ప్రకాష్ మృతి చెందగా, గంగాప్రసాద్ గాయపడ్డాడు. నిందితుడిపై మర్డర్ కేసుతో సమానమైన సెక్షన్లు నమోదు చేసి, ట్యాంకర్‌ను సీజ్ చేసి రిమాండ్‌కు పంపించారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్‌పై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.