పోలవరం ఎమ్మెల్యేను కలిసిన టీడీపీ టౌన్ ప్రెసిడెంట్

ELR: జంగారెడ్డిగూడెం టీడీపీ పట్టణ అధ్యక్షుడు కొండ రెడ్డి కిషోర్ శుక్రవారం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు సమస్యలపై ఆయనతో చర్చించారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.