'పద్మశాలి సంఘం పటిష్టతకు నిరంతరం కృషి'
SRD: పద్మశాలి పట్టణ సంఘం పటిష్టతకు నిరంతరం కృషి చేస్తామని నూతన అధ్యక్షుడు నర్సింలు తెలిపారు. నేడు ఖేడ్ మార్కండేయ ఆలయంలో పట్టణ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందులో గౌరవ అధ్యక్షులుగా పండరి, ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్, సంగన్న, ప్రధాన కార్యదర్శి విట్టల్, కోశాధికారి చిప్ప అనంతం, ప్రచార, సలహా కార్యదర్శులు హనుమాన్లు, రాములు ఉన్నారు.