‘చెడుకు దూరంగా ఉండాలి’

‘చెడుకు దూరంగా ఉండాలి’

KNR: యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని తిమ్మాపూర్ తహసీల్దార్ కర్ర శ్రీనివాస్ రెడ్డి సూచించారు. 79వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా రామక్రిష్ణకాలనీలో గ్రామస్థాయి వాలీబాల్ టోర్నీని ప్రారంభించి మాట్లాడారు. నిర్వాహకులు రేవెల్లి రవి, భూతం శ్రీకాంత్, రాకేష్, కళ్లెం అజయ్, కిన్నెర శ్రీనివాస్‌ను అభినందించారు. ఆయా పార్టీల నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.