అదనపు కట్నం కోసం వేధింపులు.. భర్తపై కేసు నమోదు

అదనపు కట్నం కోసం వేధింపులు.. భర్తపై కేసు నమోదు

NLR: అదనపు కట్నం కోసం భార్యను వేధించిన భర్తపై కావలి పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌కు చెందిన కుర్రా విష్ణుసాయికి, కావలికి చెందిన జి. శివాణితో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వివాహం తర్వాత అదనపు కట్నం కోసం భర్త మానసికంగా, శారీరకంగా హింసించడంతో బాధిత మహిళ పుట్టింటికి వెళ్లింది. సోమవారం ఆమె స్థానిక పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.