ప్రమాదం అంచున ప్రయాణం
ADB: నార్నూర్ నుంచి కెరమెరికి వెళ్లే రోడ్డు మలంగి ఘాట్ రోడ్డు వద్ద ప్రమాదకరంగా ఉంది. ఘాట్ రోడ్డు మలుపుల వద్ద ఎలాంటి రక్షణ లేకపోవడంతో ప్రమాదం అంచున వాహనాలు ప్రయాణిస్తున్నాయి. గతంలో ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయిన ఘటనలు చాలా ఉన్నాయి. వెంటనే అధికారులు స్పందించి రోడ్డుకు ఇరువైపులా రక్షణ గోడ ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.