ఎమ్మెల్యే చొరవతో పూసలలో యూరియా కొరత నివారణ

ఎమ్మెల్యే చొరవతో పూసలలో యూరియా కొరత నివారణ

PDPL: సుల్తానాబాద్ పట్టణం పూసాలలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరతను ఆదివారం పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు చొరవతో నివారించారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు వేగోళం అబ్బయ్య గౌడ్ ఆధ్వర్యంలో లారీ లోడు యూరియా తెప్పించి, ఒక్కో రైతుకు రెండు బస్తాలు చొప్పున అందజేశారు. ఎస్సై శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో టోకెన్ల ద్వారా రైతులకు పంపిణీ చేశారు.