ధర్మవరం నుంచి ప్రత్యేక బస్సులు

ధర్మవరం నుంచి ప్రత్యేక బస్సులు

సత్యసాయి: శ్రావణ మాసం సందర్భంగా హనుమాన్ దర్శనానికి 6వ తేదీ నుంచి ధర్మవరం డిపో నుండి ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ పేర్కొన్నారు. ప్రతి మంగళ, శనివారాల్లో ధర్మవరం డిపో నుంచి మురడి, నేమకల్లు, కసాపురం ఆలయాల్లో ఆంజనేయస్వామి దర్శనార్థం బస్సు ఏర్పాటు చేశామని, రిజర్వేషన్ సౌకర్యం ఉందన్నారు. ఛార్జీ పెద్దలకు రూ.580, పిల్లలకు రూ.300గా ఉందన్నారు.