దివ్యాంగుల చట్టంపై అవగాహన

దివ్యాంగుల చట్టంపై అవగాహన

ప్రకాశం: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా బుధవారం కనిగిరిలోని ఎస్‌కేఆర్ మానసిక దివ్యాంగుల ఆశ్రమ పాఠశాల నందు మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ.. వైకల్యం అనేది ఒక ఘటన మాత్రమే కానీ సమస్య కాదు అనే విషయం పట్ల సమాజాన్ని చైతన్య పరచవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.