మున్సిపల్ పోరుకు 'పోలీస్' పహారా: ఎస్పీ

మున్సిపల్ పోరుకు 'పోలీస్' పహారా: ఎస్పీ

SRPT: జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు 1250 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. ప్రచార సమయం ముగిశాక స్థానికేతరులు ఉండరాదని, ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఉంచామని, ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయాలని కోరారు.