యలమంచిలిలో వినూత్ననిరసన ర్యాలీ

యలమంచిలిలో వినూత్ననిరసన ర్యాలీ

W.G: దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సీఐటీయూ ఆధ్వర్యంలో యలమంచిలి మండల కేంద్రంలో నాయకులు మెడలో ఉరితాళ్లుతో నిరసన వ్యక్తపరిచారు. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా పురవీదుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. నల్ల చట్టాలను రద్దు చేయాలి, కొత్త లేబర్ కోడ్స్ రద్దు చేయాలి, ఉద్యోగుల, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. కొత్త లేబర్ కోడ్స్ కార్మికులకు ఉరితాళ్ళుగా మారాయని తెలిపారు.