లైన్‌మెన్ నిర్లక్ష్యంతో రైతు మృతి
JN: జాఫర్‌గఢ్ మండలం ఉప్పుగల్లులో విద్యుత్ లైన్‌మెన్ నిర్లక్ష్యంతో శనివారం రైతు పెండ్యాల బిక్షపతి (39) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. పొలానికి నీళ్లు పెట్టే క్రమంలో ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఫీజు సమస్యపై జేఎల్‌ఎంకు సమాచారం ఇవ్వగా, ఎల్‌సీ ఇచ్చినప్పటికీ లైన్‌మెన్ ముందస్తు సమాచారం లేకుండానే ఎల్‌సీ ఆన్ చేయడంతో ప్రమాదం జరిగింది అని ఆరోపించారు.