వరంగల్ కాంగ్రెస్‌లో మళ్లీ ముదిరిన వివాదాలు

వరంగల్ కాంగ్రెస్‌లో మళ్లీ ముదిరిన వివాదాలు

TG: తనకు తెలియకుండా వరంగల్ భద్రకాళీ అమ్మవారి ఆలయంలో ధర్మకర్తలను మంత్రి కొండా సురేఖ నియమించారని స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆరోపించారు. తన ఓపికను పరీక్షించొద్దని వార్నింగ్ ఇచ్చారు. అయితే నాయిని అదృష్టం కొద్ది గెలిచారని కొండా సురేఖ విమర్శించారు. నాయిని గురించి మాట్లాడటం అనవసరం అని కొట్టిపారేశారు. మంత్రిగా ఇద్దరికి పదవులు ఇచ్చే స్వేచ్ఛ తనకు లేదా? అని ప్రశ్నించారు.