హాలియా మున్సిపాలిటీ కో ఆప్షన్ సభ్యుల నియామకం
NLG: హాలియా మున్సిపాలిటీ కో ఆప్షన్ సభ్యుల నియామకం ఇవాళ జరిగింది. మున్సిపల్ కమిషనర్ మున్సిపాలిటీ కో ఆప్షన్ నూతన సభ్యుల ఎన్నికను చేపట్టారు. మొత్తం నలుగురు సభ్యులకు గాను 28 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ప్రత్యేక కేటగిరి విభాగంలో వర్కాల శేఖర్ రెడ్డి, కొమ్మనబోయిన జయమ్మలను నియమించగా మైనారిటీ విభాగం నుంచి రషీద్, చెన్ను రాజేశ్వరిలను నియమించారు