నల్లవాగును పరిశీలించిన కలెక్టర్
NTR: నందిగామ మండలం చందాపురం వద్ద ఉన్న నల్లవాగును జిల్లా కలెక్టర్ లక్ష్మీశ బుధవారం సాయంత్రం పరిశీలించారు. వాగు వద్ద వరద ఉధృతి కొనసాగుతున్నందున రాకపోకలు పూర్తిగా నిలిపివేసినట్లు ఆయన తెలిపారు. వరద తగ్గే వరకు ప్రజలు ఈ మార్గంలో ప్రయాణించవద్దని సూచించారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో విపత్తును ఎదుర్కొందని కలెక్టర్ వివరించారు.