విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా
KNR: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కరీంనగర్లోని మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంప్ కార్యాలయ ముట్టడికి AISF విద్యార్థి సంఘం నాయకులు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారిని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. AISF నాయకులు మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్స్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ధర్నాచేశారు.