యూరియా కోసం బారులు తీసిన రైతులు

MBNR: మిడ్జిల్లోని PACS వద్ద యూరియా కోసం గురువారం రైతులు భారీగా తరలివచ్చారు. ఒక ఆధార్ కార్డుపై మూడు బస్తాల యూరియా మాత్రమే ఇస్తున్నారని రైతులు వాపోయారు. ఒక్కొక్క రైతు నాలుగు ఐదు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నామన్నారు. ఒక్కో ఆధార్ కార్డుపై 5 బస్తాల యూరియా ఇస్తే ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. యూరియా కొరత లేకుండా చూడాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.