మటన్ లివర్ తింటున్నారా?
మటన్ లివర్ తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో విటమిన్ A, B6, B12, రిబోఫ్లేవిన్, నియాసిన్ వంటి విటమిన్లు, ఐరన్, జింక్, రాగి, సెలీనియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్లు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. శక్తి జీవక్రియకు అవసరమైన పోషకాలను అందిస్తాయి. అయితే దీనిని మితంగా తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.