అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ పట్టివేత

KNR: అనుమతి లేకుండా బొమ్మకల్ శివారులో వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను ఆదివారం పట్టుకున్నట్లు కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. బొమ్మకల్‌కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ సిరిసిల్ల అజయ్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. ఎవరైన అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు.