ఆదోని బంద్.. ఉద్రిక్తత
కర్నూలు: ఆదోని జిల్లా డిమాండ్‌తో బంద్ ఉద్రిక్తంగా కొనసాగుతోంది. ఉదయం 5 గంటల నుంచే జేఏసీ నాయకులు ఆర్టీసీ డిపో వద్ద బైఠాయించి బస్సుల విడుదలను ఆపుతున్నారు. వారిని పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. జిల్లాకై ప్రాణాలర్పించేందుకు సిద్ధమని జేఏసీ నేతలు చెప్పి, బంద్‌కు అధికారులు, పోలీసుల సహకారం ఇవ్వాలని కోరారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని జేఏసీ నేతలు వెల్లడించారు.