ఘనంగా గంగమ్మ అమ్మవారి చాటింపు కార్యక్రమం

ఘనంగా గంగమ్మ అమ్మవారి చాటింపు కార్యక్రమం

CTR: కుప్పం గ్రామదేవత శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర చాటింపు కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా కోడిమాను పూజ, పెద్ద బావి దగ్గర గంగ పూజ కార్యక్రమాలు అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో MLC కంచర్ల శ్రీకాంత్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.