కన్నాపూర్ గ్రామ సర్పంచ్ ఏకగ్రీవం

కన్నాపూర్ గ్రామ సర్పంచ్ ఏకగ్రీవం

జగిత్యాల రూరల్ మండలంలోని కన్నాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి పొట్టవత్తిని సతీష్ ఏకగ్రీవమయ్యారు. ఏకగ్రీవమైన సర్పంచ్, పాలకవర్గ సభ్యులు మాజీ మంత్రి జీవన్ రెడ్డిని జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో కలిశారు. జీవన్ రెడ్డి వారిని శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.