పుంగనూరులో అంగన్వాడీలు ధర్నా

CTR: సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు. బుధవారం పుంగనూరులోని ICDS ప్రాజెక్ట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, పని గంటలు తగ్గించాలని, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తెలిపారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని వారు కోరారు. అనంతరం CDPO రాజేశ్వరికి వినతి పత్రం అందజేశారు.